Home

»

Latest News

కలిసి సినిమా చూసిన సమంత, నాగచైతన్య..!

Jun 03, 2016

సమంత, నితిన్ జంటగా నటించిన అ..ఆ నిన్న రిలీజైంది. ఒక మల్టీప్లెక్స్ లో సమంత సినిమా చూసింది. మామూలుగా అయితే ఇదేమంత వార్త కాదు. కానీ గత కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ అని అందరూ చెబుతున్న నాగచైతన్యతో కలిసి సినిమా చూడటమే ఇక్కడ సెంటారాఫ్ అట్రాక్షన్ అయింది. ఇద్దరూ విడివిడిగా హాల్ కు హాజరయ్యారని, కలిసి సినిమా చూసి విడివిడిగా ఎస్కేప్ అయ్యారని సమాచారం. అయితే,వీళ్లు సినిమా చూస్తున్న సమయంలో ఎవరో జూమ్ చేసి మరీ ఫోటో కొట్టడంతో, ఈ విషయం బయటికొచ్చింది. త్వరలోనే నేను ఒక హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని సమంత చెప్పినప్పుడు, ఎవర్ని చేసుకుంటుందో ఆ అబ్బాయి ఎవరో అన్న గెస్సింగ్ మొదలైంది. అయితే మెజారిటీ జనం ఆ కుర్రాడు నాగచైతన్యే అని ఫిక్స్ చేసేశారు. ఇప్పుడు ఈ ఫోటోతో అది ప్రూవ్ అయిపోయింది. మరి సమంత ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. మూవీ విషయానికొస్తే, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అ..ఆ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫస్ట్ డే పాజిటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ తెరకెక్కించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com