Home

»

Latest News

పాప‌కు పేప‌ర్ చూస్తే ఫీవ‌ర్ అట‌!

May 31, 2016

టాలీవుడ్ మీడియాపై స‌మంత గుర్రుగా ఉంది. నా గురించి వార్త‌లు రాయ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్నారా ఏంటి? అంటూ సెటైర్లు వేస్తోంది.  పేప‌ర్ చూడాలంటేనే భ‌యంగా ఉంద‌ని.. క‌ళ్లు మూసుకొని పేజీలు తిప్పుతున్నాన‌ని తెగ క‌టింగులు ఇస్తోంది! స‌మంత పెళ్లి వార్త ఈమ‌ధ్య టాలీవుడ్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. 'నేను ప్రేమ‌లో ఉన్నానోచ్‌' అంటూ త‌నే డ‌ప్పుకొట్టుకొని - ఇప్పుడు ఆ సంగ‌తి మ‌ళ్లీ అడిగితే చిరాకు ప‌డుతోంది. ''నా పెళ్లి విష‌యం త‌ప్ప ఇంకేమైనా అడగండి. చెబుతా. నా పెళ్లి క‌బుర్లే కావాలంటే దాని కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెడ‌తా. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకొందాం'' అంటూ జోకులు వేస్తోంది. నేనొక‌టి చెబితే మ‌రోటి రాస్తున్నారు, ఏం చెప్పినా, మీకు కావ‌ల్సిన స‌మాధానాలే పేప‌ర్లో క‌నిపిస్తున్నాయి... ఇది మరీ దారుణం, మ‌న మీడియా మ‌రీ అంత మంచిది కాదేమో అనిపిస్తోంది. 'నేను ప్రేమ‌లో ఉన్నాను' అన‌గానే ఏవేవో రాశారు. నాతో ప‌నిచేసిన హీరోల లిస్టు వేసి, అందులో నేనెవ‌రితో ప్రేమ‌లో ఉన్నానంటూ ఫ‌జిల్లు పెట్టారు. ఇది మరీ దారుణం.. అంటూ తెగ ఫీలైపోతోంది. కొన్నాళ్లు మీడియాకు క‌నిపించ‌కుండా ఎటో వెళ్లిపోతుంద‌ట‌. మీడియా అంటే మ‌రీ అంత‌లా భ‌య‌ప‌డిపోతుందా..?  మ‌రీ ఓవ‌ర్‌గా లేదూ.!!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com