రుద్రమదేవి విడుదలెప్పుడో?
on Jun 18, 2015
.jpg)
గుణ శేఖర్ కి తనపై తనకి నమ్మకం పోయిందా? కదనరంగంలోకి దూకుతా అంటున్న రుద్రమదేవిని వెనక్కు లాగుతున్నాడా? తన సినిమాని బాహుబలితో కంపేర్ చేసుకుంటున్నాడా?. రుద్రమదేవి వాయిదా పడుతోంది అన్న వార్త విన్నవాళ్లంతా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు.
షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ డేట్ ప్రకటించే వరకూ పురిటినొప్పులు ఎదుర్కొన్న రుద్రమదేవికి మళ్లీ బ్రేక్ వేస్తున్నారని వార్తలు రావడంతో అసలు ఈ సినిమాకు మోక్షం ఉంటుందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే ఈ చిత్రం వాయిదా వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణం కాదట. గ్రాఫిక్స్ తేలిపోయినట్టున్నాయని గుణశేఖర్ సన్నిహులు తేల్చిచెప్పారట.
క్వాలిటీపై దృష్టిపెట్టకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారట. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న రుద్రమదేవికి మరింత పదునుపెట్టే పడ్డాడట గుణ. మొత్తానికి దాదాపు 70కోట్ల వ్యయంతో నిర్మించిన రుద్రమదేవి గుణశేఖర్ ను నిలువునా ముంచిందని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలెప్పుడో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



