లేడీ ఎమ్మెల్యే పై వర్మ కామెంట్స్..!
on May 24, 2016

వర్మగారి ట్విట్టర్ ఎప్పుడూ సైలెంట్ గా ఉండదు. ఎవరొకరి మీద సెటైర్ వేయకపోతే ఆయనకు మనసొప్పదు. లేటెస్ట్ గా మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత, సూపర్ స్టార్ కు క్లాస్ పీకాడు వర్మ గారు. ప్రస్తుతం ఆయన మనసు పాలిటిక్స్ మీదకు మళ్లింది. అందుకు కూడా కారణం ఉందండోయ్. బిజేపీ తరపున అస్సాం ఎమ్మెల్యేగా గెలిచింది హీరోయిన్ అంగూర్ లతా. ఆమెను చూసిన తర్వాత తనకు తొలిసారిగా పాలిటిక్స్ మీద ప్రేమ కలిగిందని మరింత మంది హీరోయిన్లు పాలిటిక్స్ లోకి రావాలని కోరుకుంటున్నా అంటున్నాడు వర్మ. ఎమ్మెల్యే ఇంత అందంగా ఉంటే మంచి రోజులు వచ్చేసినట్టే. మోడీగారికి ధన్యవాదాలు. మొదటిసారిగా నాకు పాలిటిక్స్ అంటే ప్రేమ కలిగింది. అంటూ తన ట్వీట్ చేశాడు. తన మనసులో ఏమి అనుకున్నా వెంటనే చెప్పేయడానికి, ట్విట్టర్లో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించడు రామ్ గోపాల్ వర్మ. అయితే ప్రజా ప్రతినిథి గురించి ఇలా సెక్సిస్ట్ కామెంట్స్ చేయడం పట్ల మాత్రం, మహిళా సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



