Home

»

Latest News

కిక్ 2 లో డబుల్ ఎంటర్‌టైన్మెంట్

Aug 19, 2015 3:15PM

కిక్ తో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిన మాస్ రాజా రవితేజ, ఇప్పుడు కిక్ 2 తో డబుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమైపోయాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ 2 సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి వుండడంతో ఈ సినిమా ప్రమోషన్ జోరు పెంచాడు రవితేజ. మీడియా చిట్ చాట్ లతో హంగామా చేస్తున్నాడు.

బాహుబలి తరువాత తెలుగు సినిమా మార్కెట్ పెరింగిందని అలాగే శ్రీమంతుడు తర్వాత మనం కూడా కాస్త డిఫరెంట్ గా ఏదైనా చేయవచ్చేమో అన్న ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాడు. ఇక రకుల్ ప్రీత్‌కి డెడికేషన్ బాగా ఎక్కువ అని, మంచి యాక్టర్ అని తన హీరోయిన్‌ని పొగడ్తలతో ముంచేశాడు. కిక్ 2 సినిమా చాలా బాగా వచ్చిందని, ఇందులో కూడా ఎమోషన్లు, మెసేజ్ అన్నీ వున్నాయని అంటున్నారు. అలాగే బెంగాల్ టైగర్ పక్కా కమర్షియల్ సినిమా అని, సంపత్ నంది బాగా తీస్తున్నాడని చెప్పుకొచ్చాడు.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com