Home

»

Latest News

'అర‌ణ్య' న‌న్ను పూర్తి మ‌నిషిగా మార్చింది: రానా

Mar 04, 2021

 

"నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదోక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్‌ మరింత బలపడింది." అని చెప్పారు రానా ద‌గ్గుబాటి. ఆయ‌న టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అర‌ణ్య'‌. విష్ణు విశాల్‌, శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్‌ ముఖ్య పాత్రదారులు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఈరోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మార్చి 26న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తోంది. 

'అర‌ణ్య' ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో రానా మాట్లాడుతూ, ‘‘నాలుగేళ్ళ తరువాత 'అరణ్య' సినిమా వస్తోంది. ప్రభు సాల్మన్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది.  ఈ చిత్రంలో అరణ్య క్యారెక్టర్ ప్లే చేశాను.. ప్రభు సాల్మన్ స్టయిల్ లోనే ఈ చిత్రం ఉంటుంది. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం’ అనేది అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ‘ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఆ భూమిని నువ్వు చూసుకుంటే.. అది నిన్ను మళ్లీ చూసుకుంటుంద’ని. సిటీ, టౌన్ లో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా కాపాడాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. అని తెలిపాడు.

ప్రభు సాల్మ‌న్‌తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ నిచ్చిందని రానా చెప్పాడు. "ఆయనది ఒక సెపరేట్ స్కూల్. అనుకున్న సీన్ వచ్చేదాకా తను ఎన్ని టేక్ లైనా తీస్తాడు. థియేటర్స్ లో ప్రేక్షకులకు మనం చెప్పే కథ నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతాడు. అందుకని వారికి నచ్చే సీన్స్ చేయాలి అని ప్రభు చెప్తుంటాడు.. ఆయనలో నాకు బాగా నచ్చిన విషయం ఇది. నాకింత మంచి చిత్రం ఇచ్చినందుకు ప్రభుకు థ్యాంక్స్‌. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లో చేశాం. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని  థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోస్ నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసి మార్చి 26న వరల్డ్ వైడ్ గా బిగ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకి నా స్పెషల్ థ్యాంక్స్‌".. అని చెప్పుకొచ్చాడు రానా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com