చరణ్ కావాలనే లేటుగా చేస్తున్నాడట
on Sep 3, 2015
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ మూవీ 'బ్రూస్ లీ' దసరా బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి దసరాకి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తూ వస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమా దసరాకి వచ్చే సూచనలు ప్రస్తుతం కనబడంలేదని అంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కూడా వచ్చి చేరడంతో ఆయన కోసం కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఈ మార్పుల వల్ల సినిమా చిత్రీకరణలో జాప్యం జరుగుతుందని ఇన్ సైడ్ టాక్. అయితే ఈ ప్రచారాన్ని మెగా క్యాంప్ కావాలనే చేస్తున్నారనేది కూడా ఇండస్ట్రీ టాక్.
ఎందుకంటే చరణ్ హిట్ సినిమాలలో టైమ్ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వుంటుంది. అతని సినిమాలు ఎప్పుడూ హాలిడేస్ టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. అందుకే దసరాను ఈ సారి ఎంచుకున్నారు. కానీ ఈ సారి దసరాకి అతనికి గట్టి పోటీ ఎదురయ్యింది. ఒక పక్క మెగా సినిమాలు మరోపక్క రుద్రమదేవి, అఖిల్ మూవీ వుండడంతో... ఈ పోటీలో తన సినిమా విడుదల చేసి, అనవసరంగా ఇబ్బంది పడడం ఎందుకు అన్న ఆలోచనలో చరణ్ వున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచీ ఇంకా పని పూర్తి కావడం లేదు, స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు వంటి వార్తలు వదులుతున్నారన్నది టాలీవుడ్ గుసగుసల సారాశం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



