Home

»

Latest News

చిరు రాజకీయం చరణ్ చేతిలో

Jul 25, 2017 11:33AM

 

చిరంజీవి రాజకీయాల్లో చేదు అనుభూతి పొంది ఉండవచ్చు కానీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెగా స్టార్ గా చిరస్మరణీయంగా ఉండిపోతారు. ఖైదీ నం 150 తో తెలుగులో గ్రాండ్ రే ఎంట్రీ ఇచ్చిన చిరు, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ మహావీర తో తన స్టామినా ఏంటో హిందీ, తమిళ ప్రేక్షకులకి రుచి చూపించనున్నాడు. తన కెరీర్ లో చిరంజీవి కొన్ని రాజకీయ నేపథ్య సినిమాలు చేసాడు. మంత్రి గారి వియ్యంకుడు, పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాకపోయినా, పొలిటికల్ టచ్ అయితే ఉంటుంది.

ఇప్పుడు, రామ్ చరణ్ ఈ సినిమాకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని వినికిడి. ప్రస్తుతం, సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్న రామ్ చరణ్, దిల్ రాజు బ్యానర్ లో, త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి మనకి తెలిసిందే. కొత్త స్టోరీ చేయడం కన్నా మంత్రి గారి వియ్యంకుడిని రీమేక్ చేస్తే బెటర్ అని త్రినాథ రావు చెప్పడంతో చరణ్ కూడా ఒకే చేసాడట. కుటుంబ కథ చిత్రం గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఈ తరం కి తగ్గట్టు అన్ని అంశాలు పొందుపరిచేలా జాగ్రత్తలు తీసుకుంటారట. మొదటి సారి చిరంజీవి సినిమా రీమేక్ చేయబోతున్న చరణ్ కి అల్ ది బెస్ట్ చెబుదామా!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com