Home

»

Latest News

మారుతి డైరెక్ష‌న్‌లో.. చెర్రీ, బ‌న్నీ

Nov 25, 2014 9:57AM

Ram Charan Allu Arjun with maruti, Ram Charan Allu Arjun, Memu Saitham

ఔను.. చిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి.... ఇప్పుడో గొప్ప ఆఫ‌ర్ కొట్టేశారు. బ‌న్నీ, చెర్రీల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నాడు. కాక‌పోతే.. చిన్న క‌రెక్ష‌న్‌. సినిమా కోసం కాదు. ఓ స్కిట్ కోసం. హుద్ హ‌ద్ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డానికి తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మేము సైతం అనే ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈనెల 30న హైద‌రాబాద్‌లో ఏకంగా 12 గంట‌ల పాటు టెలీ మార‌థాన్ రూపంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. అగ్ర క‌థానాయ‌కులు, నాయిక‌లు, హాస్య‌న‌టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఇలా అంద‌రూ ఏదో ఓ స్కిట్‌లో క‌నిపించ‌బోతున్నారు. మెగా హీరోలు చ‌ర‌ణ్‌, బ‌న్నీలు కూడా ఓ స్కిట్ వేసి వినోదాలు పంచ‌బోతున్నారు. ఈ స్కిట్‌కి సంబంధించిన ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం మారుతి చూసుకొంటున్నారు. మ‌రి మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న స్కిట్ ఎలా ఉంటుందో..?? ఈ స్కిట్ ద్వారా మారుతి త‌న టాలెంట్‌ని మెగా హీరోల ద‌గ్గ‌ర ప్రూవ్ చేసుకోవాల‌నుకొంటున్నాడు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com