ఎయిర్ పోర్ట్ లో గాయపడిన రకుల్ ప్రీత్ సింగ్..!
on Jun 7, 2016
.jpg)
టాలీవుడ్ లో హీరోయిన్లలో మోస్ట్ బిజియస్ట్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పాలి. వరస సినిమాలు, ఈవెంట్స్ తో రాత్రి పగళ్లు తేడా లేకుండా కష్టపడుతోందీ భామ. ఇప్పుడు హీరోయిన్ కెరీర్ స్పాన్ కేవలం ఐదు పదేళ్లు మాత్రమే ఉంటోంది కాబట్టి, ఎంత వీలయితే అంత వెనకేసుకోవడానికి ట్రై చేయడంలో తప్పు కూడా లేదులే. అయితే ఈ హడావిడిలో దెబ్బలు కూడా తగులుతుంటాయి. తాజాగా అలా హడావిడి పడుతూ వెళ్తున్న సమయంలో అమెరికా ఎయిర్ పోర్ట్ లో రకుల్ ప్రీత్ గాయపడిందట.
విషయంలోకి వెళ్తే, రకుల్ ప్రీత్ గత కొన్ని రోజులుగా అమెరికాలో జరుగుతున్న తెలుగు కల్చరల్ ఈవెంట్ లో ఉంది. అక్కడి నుంచి తన సినిమా షూటింగ్ కోసం సింగపూర్ చేరుకోవాలి. అయితే అక్కడ ఈవెంట్ కారణంగా ఎయిర్ పోర్ట్ కు ఆలస్యమైందట. హడావిడిగా ఫ్లైట్ కోసం వెళ్తున్న సమయంలో కిందపడిపోవడం వలన కాలి మడమల్లో గాయమైందని సమాచారం. జస్ట్ ఒక నిముషం పాటు అక్కడ రిలాక్స్ అయి వెంటనే సింగపూర్ కు స్టార్ట్ అయిపోయిందట. ఆమె ఫ్రొఫెనలిజానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు రకుల్ అభిమానులు. ఈ కారణంగానే డైరెక్టర్లకు, తోటి నటులకు రకుల్ ఫేవరెట్ యాక్ట్రెస్ గా మారిపోయింది. హీరోయిన్లలో తమన్నా, రకుల్ ప్రీత్ లకు పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారనే మంచి పేరు ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



