రజనీకాంత్ ను పొగిడేస్తున్న బాలయ్య హీరోయిన్..!
on Apr 27, 2016

బాలయ్య సరసన లెజండ్ సినిమాలో నటించిన రాధికా ఆప్టే, బాలీవుడ్ లో కథా నేపథ్యమున్న చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. అవి కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీలో నటించే అవకాశం కూడా రాధికను వరించింది. ఆయనతో కలిసి వయసైపోయిన పాత్రలో నటించిన రాధికా, రజనీని పొగిడేస్తోంది. రజనీతో కలిసి నటించిన ప్రతీ హీరోయిన్ చెప్పే మాటలే అయినా, అదే రజనీ స్పెషాలిటీ అంటోంది. ఆయనకు సాటెవరూ లేరని, ఆయనతో షూటింగ్ లో పాల్గొన్న రోజులు తన జీవితంలో చాలా విలువైనవనీ, తోటి నటీనటులకు ఆయన స్ఫూర్తి అంటూ రజనీని ఆకాశానికెత్తేస్తోంది. కబాలీలో ఏజ్ అయిపోయిన గ్యాంగ్ స్టర్ గా రజినీ నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తాజా బాలీవుడ్ సినిమా ఫోబియా ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో ఒక విలేకరి కబాలీలో వర్కింగ్ గురించి అడిగినప్పుడు ఇదంతా చెప్పుకొచ్చింది. రాధికా ఆప్టే లీడ్ రోల్ చేసిన ఫోబియా కూడా మంచి కథాంశంతో రూపొందుతోంది. కబాలీ తర్వాత తనకు మరిన్ని మంచి అవకాశాలొస్తాయని ఆశిస్తోందీ భామ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



