Home

»

Latest News

పూరి - నితిన్‌... డిష్యూం డిష్యూం?

Jun 19, 2015 2:59PM

నితిన్ సినిమా ఆగిపోయిన త‌ర‌వాత‌ పూరి జ‌గ‌న్నాథ్‌కి కంటిమీద కునుకు ఉంటుందో, లేదో..? ఎందుకంటే.. వ‌రుస‌గా ఆయ‌న‌కు అన్నీ త‌ల‌నొప్పులే ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు.. చిరు 150వ సినిమా ఉంటుందా, ఊడుతుందా అనే టెన్ష‌న్ ప‌ట్టుకొంది. త‌న సినిమాల విష‌యంలో ఛార్మి విప‌రీతంగా జోక్యం చేసుకొంటోంద‌న్న టాక్‌బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు నితిన్ వైపు నుంచి కూడా పూరి ఒత్తిడికి గుర‌వుతున్నాడు.

నితిన్ సినిమా విష‌యంలో సుధాక‌ర్ రెడ్డి నుంచి పూరి అడ్వాన్సుగా రెండో కోట్ల రూపాయ‌లు తీసుకొన్న‌ట్టు వినికిడి. ఇప్పుడా రెండు కోట్లు వెన‌క్కి ఇవ్వ‌మ‌ని నితిన్ ఒత్తిడి తీసుకొస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు పూరి 'చూద్దాం, చేద్దాం' అని కాల‌యాప‌న చేస్తున్న‌ట్టు, ఈ విష‌యంలో నితిన్ ద‌ర్శ‌కుల సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఛార్మిపై సుధాక‌ర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.

'డ‌బ్బులు లేక‌పోవ‌డం వ‌ల్లే నితిన్ సినిమా ఆడిపోయింద‌'న్న త‌ప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వ‌డం వల్ల త‌న ప‌రువు పోయింద‌ని, ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత‌ల మండ‌లి ఛార్మిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ హ‌గ్గులిచ్చుకొని ఫొటోల‌కు పోజులిచ్చిన పూరి - నితిన్‌ల మ‌ధ్య ఇప్పుడు గంభీర‌మైన వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. మ‌రి చివ‌రికి ఈ క‌థ ఎలా ముగుస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com