Home

»

Latest News

పెళ్లి పీటలెక్కిన హీరో ప్రిన్స్ .. వధువు ఎవరో తెలుసా!

Aug 24, 2026 3:01PM

 

 

టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ తన  ప్రియురాలు, ఎన్నారై సాయి ప్రతిమ (సాయి మాచిరాజు) మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు . న్యూజిలాండ్‌లోని ‘వానకా’ (Wanaka) ఏరియాలో  నిన్న  23న అత్యంత వైభవంగా వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.

 ప్రిన్స్ రాయల్ ఐవరీ కలర్ ప్రింటెడ్ పైజామా ధరించి రాకుమారుడిలా కనిపించగా, వధువు సాయి ప్రతిమ ఎరుపు రంగు పట్టుచీర, సాంప్రదాయ స్వర్ణాభరణాల ముస్తాబుతో మహారాణిలా మెరిసిపోయారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్రిన్స్ "లైఫ్‌టైమ్ హ్యాపీనెస్" అని ఆనందం వ్యక్తం చేయగా పెళ్లి పిక్స్  ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. న్యూజిలాండ్‌లో స్థిరపడిన మాచిరాజు వెంకట రమేష్, లక్ష్మీ సుజాతల కుమార్తె అయిన సాయి ప్రతిమతో ప్రిన్స్‌కు గత ఏడాది ఒక ఉమ్మడి మిత్రుడి వివాహ వేడుకలో తొలి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా  ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో  జూన్ నెలలో నిశ్చితార్థం జరగగా, పూర్తిగా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రిన్స్ ఆ సమయంలో చెప్పడం జరిగింది. న్యూజిలాండ్ వెడ్డింగ్ అనంతరం త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయడానికి ఈ జంట ప్రణాళికలు రచిస్తోంది.  


Also Read: 70 ఏళ్ల నిర్మాతతో రిలేషన్‌షిప్... కారు, ఇల్లు ఇస్తా అన్నాడు!


2012లో దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రిన్స్, ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ చిత్రంతో యూత్‌ఫుల్ హీరోగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. ‘నేను శైలజ’, ‘రొమాన్స్’ వంటి చిత్రాలతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’లలో కీలక పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా అలరించడంతో పాటు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) లో ‘తెలుగు వారియర్స్’ తరఫున ఆడుతూ క్రీడాభిమానులను కూడా ఆకట్టుకుంటూ వస్తున్నాడు.ప్రస్తుతం ఓటిటి ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో రియల్ లైఫ్‌లోనూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ నూతన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రిన్స్ పూర్తి పేరు ప్రిన్స్ సెసిల్.    

Prince Cecil,  Sai Prathima

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com