13 ఏళ్లకే డ్రగ్స్ వాడానంటున్న హీరో..
on Aug 12, 2017
.jpg)
గతకొద్దిరోజులుగా టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. మరోపక్క తమ పేరు ఎప్పుడు బయటకు వస్తుందా అని చెమటలు కక్కేవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో తాను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే డ్రగ్స్ తీసుకునేవాడినని చెప్పుకొచ్చాడు ఓ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? టాలీవుడ్ హీరో కాదులెండి. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆయన.. ' రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ లాంటి లెజెండ్ కడుపున పుట్టానే గాని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని... 13 ఏళ్ల వయసులో ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడేవాడిని.. అప్పుడే డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యాను... మానేయాలన్న ఆలోచన వచ్చినా.. నా వల్ల అయ్యేది కాదు. చివరకు డాక్టర్లు నా సమస్యకు పరిష్కారం చూపించారు. జీవితం నాశనం చేసుకోవటం కన్నా.. కష్టపడి డ్రగ్స్ వాడకాన్ని మానేయటం కరెక్ట్' అని చెప్పుకొచ్చాడు.
కాగా లెజెండరీ యాక్టర్స్ రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు ప్రతీక్ బబ్బర్. ఏక్ దివానా థా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



