Home

»

news

ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌నువైట్ల - దోస్త్ మేరా దోస్త్‌

Mar 30, 2015

 

రాజ‌కీయాల్లోనే కాదు.. సినిమారంగంలోనూ శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని నిరూపించాడు శ్రీ‌నువైట్ల‌. కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్ల‌తో శ్రీ‌నువైట్ల‌కు క్లాష్ రావ‌డం, విడిపోవ‌డం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం మ‌ళ్లీ ఈ బ్యాచ్ క‌ల‌సిపోయింది. ఇప్పుడు క‌ల‌సి పార్టీలూ చేసుకొంటూ, దోస్త్ మేరా దోస్త్ అంటూ పాట‌లూ పాడేసుకొంటున్నారు. 'ఆగ‌డు' సినిమా వివాదంలో నువ్వెంత అంటూ నువ్వెంత అనుకొని - ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకొని - ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకొన్నారు ప్ర‌కాష్‌రాజ్ - శ్రీ‌నువైట్ల‌. ఆ ఉదంతం చూసిన ఎవ్వ‌రికైనా వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వ‌డం అసాధ్యం అనిపించింది. సీన్ క‌ట్ చేస్తే - మ‌ళ్లీ వీళ్లిద్ద‌రూ దోస్తులు అయిపోయారు. ఇటీవల జ‌రిగిన ప్ర‌కాష్‌రాజ్‌పుట్టిన రోజు వేడుక‌ల‌కు శ్రీ‌నువైట్ల హార‌జ‌య్యాడు. ఇద్ద‌రూ అలింగ‌నం చేసుకొని మ‌రీ.. క‌నిపించారు. క‌ల‌సి... ఎంజాయ్ చేశారు. రేపోమాపో ఇద్ద‌రూ క‌లుసి ఓ ప్రెస్‌మీట్ పెట్టి 'మేం క‌ల‌సిపోయామోచ్‌' అంటూ ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. రామ్‌చ‌ర‌ణ్ విడిపోయిన శ్రీ‌నువైట్ల - కోన వెంక‌ట్‌ల‌ను క‌లిపితే.. కోన ఇప్పుడు ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌నువైట్ల‌ను క‌లిపాడ‌ట‌. ఏదైతేనేం.. మొత్తానికి ఈ బ్యాచ్ మ‌ళ్లీ ఒక్క‌టేపోయింది. పాత త‌ప్పులు పునరావృతం కాకుండా.. అంద‌రూ క‌ల‌సిమెల‌సి ఉంటే... అంత‌కంటే కావల్సింది ఏముంది..???

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com