Home

»

Latest News

భార్య ప్రోఫైల్ పిక్ వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?

May 03, 2017

తెలుగు బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య బుల్లితెరను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనీ ప్రదీప్ స్నేహితులు చెప్పడం..సూసైడ్ చేసుకున్న గది..మృతదేహం పడిఉన్న విధానం..భార్య పావనిరెడ్డి చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడం పలు అనుమానాలను రేపుతోంది. ప్రదీప్ సన్నిహితులు చెబుతున్న వివరాలు ప్రకారం..అసలు నిన్న రాత్రి జరిగిన పార్టీలో ఉన్నది పావని సోదరుడు కాదని, అతడి స్నేహితుడేనని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. అతడి పేరు శ్రావణ్ అని నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాడని..అప్పటి నుంచి పావని, ప్రదీప్‌లు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాడని తెలిపారు.

ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి శ్రావణ్ తన బర్త్‌ డే పార్టీని చేసుకున్నాడని..ఆ సమయంలో శ్రావణ్‌తో చనువుగా ఉన్న ఫోటోను పావని తన మొబైల్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుందని, దీంతో ప్రదీప్ పావనితో గొడవ పడ్డాడని తెలిపారు. కనీసం సూసైడ్ నోట్ కూడా రాయకుండా ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ్, పావని ఇద్దరూ కలిసే ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చంటున్నారు. మృతదేహం మంచం కింద ఉండటం..తలపై గాయం ఉండటం వీరి వాదనలకు బలం చేకూరుస్తోంది. దీంతో పోస్ట్‌మార్టం రిపోర్ట్ నిజానిజాలను తేల్చే అవకాశం ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com