Home

»

Latest News

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది..!

Apr 27, 2016 5:00PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ అయింది. సర్దార్ ఇచ్చిన ఎఫెక్ట్ నుంచి కోలుకోవాలంటే వీలైనంత త్వరగా మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేయడమే కరెక్ట్ అని పవన్ అనుకుంటున్నారట. ఈ సినిమాను శరత్ మరార్ తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ రోజు ఉదయం నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ఆఫీస్ లో ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. పెద్దగా హడావిడి లేకుండానే సినిమాను మొదలెట్టేయడం విశేషం.

ఒక ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథగా సినిమా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే పవన్ సూర్య లు రెండు సినిమాలకు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఖుషీ కాగా, మరొకటి కొమరం పులి. బిల్లా, బెంగాల్ టైగర్ సినిమాలు చేసిన సౌందర్ రాజన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కథ డైలాగులను ఆకుల శివ ఇచ్చారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇప్పటికే రెండు పాటలకు రికార్డింగ్ పూర్తి చేశాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందని, త్వరలోనే జూన్ నుంచి మూవీ టిం మేజర్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని నిర్మాత శరత్ మరార్ చెబుతున్నారు. ఈ మధ్య ఎక్కువగా తెల్ల షర్టు, తెల్ల పంచెలో కనిపిస్తున్న పవన్, బహుశా ఇదే గెటప్ లో సినిమాలో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తాడా..? లేక ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని లవ్ చేస్తాడా..? చూడాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com