Home

»

Latest News

పవన్ కళ్యాణ్ కి ఇది వై దిస్ కొలవెరి అవనుందా?

Apr 26, 2017 3:38PM

 

అనిరుద్ రవిచంద్రన్ తన కజిన్ ధనుష్ కోసం కంపోజ్  చేసిన సాంగ్ వై దిస్ కొలవెరి ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లోనే కాదు యావత్ దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. ఇండియాలో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ వచ్చిన సాంగ్ ఇదే. ఈ పాట పుణ్యమా అని, అనిరుద్ పేరు దేశం నలుమూలలా పాకింది. తర్వాత చాలా సినిమాలకి మంచి సంగీతం ఇచ్చినా, కొలవెరి డి కి వచ్చిన రెస్పాన్స్ మరి యే ఇతర సాంగ్ కి రాలేదు. అయితే, మొదటి సారి పవన్ కళ్యాణ్ కి మ్యూజిక్ అందించే అవకాశం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా అనిరుద్ కి వచ్చింది. అంతేనా, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పాట కూడా పడనున్నాడని తెలిసింది. వేరే సాంగ్స్ విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ పాడే పాట విషయంలో అనిరుద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. కొలవెరి డి కి మించి ఉండాలి అని త్రివిక్రమ్ అనిరుద్ కి చెప్పినట్టు తెలిసింది. అత్తారింటికి దారేది లో పవన్ పాడిన కాటంరాయుడా ఎంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే. మరి, అనిరుద్ సాంగ్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ఒక వేళ అనిరుద్ తన మాట నిజంగానే నిలుపుకోగలితే పవన్ క్రేజ్ వల్ల ఆ పాట అన్ని రికార్డులు రూపుమాపడం ఖాయం!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com