పవన్ మరో ఛాన్స్ ఇస్తున్నాడా..?
on May 25, 2016
.jpg)
పవన్ కెరీర్లో ఖుషీ తర్వాత మళ్లీ అంత భారీ హిట్ గబ్బర్ సింగ్ తో కొట్టాడు. వరస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న పవన్ కు ఆ సినిమా లైఫ్ ఇవ్వడమే మళ్లీ ఆయన ఇమేజ్ ను పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు ఇప్పటి వరకూ ఎలాంటి న్యూస్ రాలేదు. పైగా, గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన సర్దార్ కు నిరాశే ఎదురైంది. దీంతో పవన్ మళ్లీ హరీష్ శంకర్ తో జతకట్టాలని, అద్భుతమైన సినిమాను అందివ్వాలని కోరుకున్నారు. వాళ్ల కోరికలు నెరవేరే సమయం వచ్చినట్టుంది. పవన్ హరీష్ కు మరో ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసి ఫర్లేదనిపించుకున్న హరీష్, తన తర్వాతి సినిమాలో పవన్ ను ఎలా చూపిస్తాడా అని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో రాబోయే ఫ్యాక్షన్ లవ్ స్టోరీ కమిట్ అయ్యారు. ఈ సినిమాతో, ఆయన సరసన శృతిహాసన్ రెండో సారి నటిస్తుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



