Home

»

Latest News

పవన్ కొత్త హెయిర్ స్టైల్ చూశారా..?

May 23, 2016 3:46PM

ఖుషీ టైంలో పవన్ సృష్టించిన మానియాలో అన్నింటికంటే ముఖ్యమైంది ఆయన హెయిర్ స్టైల్, అప్పట్లో చాలా మంది పవన్ స్టైల్ కోసం, సిల్కీ హెయిర్ కోసం పరితపించేవారు. ప్రేక్షకుల పై పవర్ స్టార్ ముద్ర అంత బలంగా ఉంటుంది. డ్రెస్సుల్లోనూ, హెయిర్ స్టైల్స్ లోనూ ఏదొక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తుంటారు పవన్. తాజాగా ఆయన కొత్త హెయిర్ స్టైల్ అంటూ ఒక కొత్త లుక్ నెట్లో హల్ చల్ చేస్తోంది. హెయిర్ పూర్తిగా పైకి లేచి ఉండి, బ్లాక్ అండ్ గ్రే హెయిర్ తో పవన్ ఈ ఫోటోలో వెరైటీగా కనిపిస్తున్నారు. ఎస్ జే సూర్య తో తెరకెక్కే సినిమా పవన్ ఇదే లుక్ ను మెయింటెయిన్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. సినిమా ప్రారంభోత్సవం రోజున కూడా ఇదే లుక్ లో ఉన్నారు పవన్. ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథ నేపథ్యంగా ఈ సినిమా సాగుతుందని పవన్ ఎప్పుడో రివీల్ చేసేశారు. ఫ్యాక్షనిస్టుగా వైట్ అండ్ వైట్ డ్రస్ తో, ఈ హెయిర్ స్టైల్ తో బాగా రగ్గడ్ గా పవన్ కనిపిస్తారా..? జూన్ 2 నుంచే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నా, పవన్ ఇంకా ఈ గెటప్ లోనే ఉన్నారంటే ఫైనల్ లుక్ ఇదే అనుకోవాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com