పవన్ కొడుక్కి యాక్సిడెంట్..రేణూ దేశాయ్ స్పందన..!
on May 11, 2016

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కొడుకు అకీరా నందన్, రీసెంట్ గా సైకిల్ పై నుంచి పడి గాయపడిన సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో పవన్ అభిమానులందరూ అకీరాకు ఎలా ఉందోనన్న ఆందోళనతో అకీరా ఫోటోను పోస్ట్ చేయమని రేణును అభిమానులు అడగడంతో, సగం పైగా ముఖం, ఎడమ కన్ను వాపుతో ఉన్నాయని, అందుకే ఫోటోలు పెట్టలేదని ఆమె స్పందించారు. ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ పై వెళుతున్నప్పుడు, గేర్ స్టక్ అయిపోవడంతో అకీరాకు యాక్సిడెంట్ అయింది. అకీరాను ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకెళితే, అక్కడ ఆలస్యం చేశారంటూ హాస్పిటల్ పై రేణు ఆగ్రహం తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పెద్ద హాస్పిటల్ కు వెళ్లడం కంటే, చనిపోవడం మేలంటూ ఆ సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి అకీరా కోలుకుంటున్నాడని, ఒక తల్లిగా తన కొడుకు కోలుకోవాలని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారామె.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



