Home

»

Latest News

ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. మూవీ ల‌వ‌ర్స్‌కి ఇక పండ‌గే!

Mar 30, 2026

వరుస సెలవులు, చల్లని సాయంత్రాలు.. తోడుగా ఒక మంచి సినిమా ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే డిజిటల్ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీ సంస్థలు భారీ విందును సిద్ధం చేశాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఇంటి వద్దే ఉండి వినోదాన్ని ఆస్వాదించే వారి కోసం ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా 16కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు ప్రాముఖ్యత కలిగిన సినిమాలతో పాటు క్రేజీ బాలీవుడ్, హాలీవుడ్ కంటెంట్ కూడా ఉండటం విశేషం.

ఈ వారం ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోల చిత్రాలు డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే శ్రీవిష్ణు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో పాటు, వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రం జీ5 వేదికగా అలరించనుంది.

మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, సీనియర్ నటి లయ, నటుడు శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఈ వారమే ఈటీవీ విన్‌లో నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత లయ తెలుగు తెరపై కనిపిస్తుండటం, ఇటీవలే బిగ్ బాస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శివాజీ ఇందులో నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హిందీ ప్రేక్షకుల కోసం ఆమిర్ ఖాన్ సమర్పణలో వస్తున్న 'సితారే జమీన్ పర్' సోనీ లివ్‌లో విడుదల కానుంది. అలాగే కామెడీ డ్రామా 'హ్యాపీ పటేల్', ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'వధ్-2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు 'రిపుల్', 'జో కిట్టీ సీజన్-3', 'బ్లడ్ హౌండ్స్ సీజన్-2' వంటి హై-వోల్టేజ్ కంటెంట్ అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం అమెజాన్ ప్రైమ్‌లో 'సెండ్ హెల్ప్' లాంటి సినిమాలు అందుబాటులోకి రానున్నాయి.

అమెజాన్ ప్రైమ్..

మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్) - ఏప్రిల్ 04

సెండ్ హెల్ప్- ఇంగ్లిష్ సినిమా - మార్చి 31

అవతార్ ఫైర్ అండ్ యాష్ - మార్చి 31

జియో హాట్‌స్టార్‌..

సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ) - మార్చి 31

ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా) - ఏప్రిల్ 03

నెట్‌ఫ్లిక్స్..

రిపుల్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - మార్చి 31

హ్యాపీ పటేల్(హిందీ సినిమా) - ఏప్రిల్ 01

జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 02

మృత్యుంజయ్(తెలుగు సినిమా) -ఏప్రిల్ 03

మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03

వధ్‌-2(హిందీ సినిమా) -ఏప్రిల్ 03

బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) -ఏప్రిల్ 03

హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03

జీ5 

హే బల్వంత్‌(తెలుగు సినిమా) - మార్చి 31

బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ) - ఏప్రిల్ 03

తానా - ఏప్రిల్ 3

ఈటీవీ విన్

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’- ఏప్రిల్ 3

ఆపీల్ టీవీ ప్లస్..

యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03

సన్‌ నెక్ట్స్..

వడం(తమిళ సినిమా) - ఏప్రిల్ 03

సోనీ లివ్

సితారే జమీన్ పర్(బాలీవుజ్ ) - ఏప్రిల్ 03

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com