బాలీవుడ్ లో కూడా తమన్నానే కరెక్టట..!
on Apr 28, 2016
.jpg)
ఇటాలియన్ సినిమా ఇంటచిబుల్స్ ను తెలుగులో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టేశారు నాగార్జున అండ్ కో. వంశీ పైడిపల్లి తెలుగు సినిప్రేక్షకుల మనసును తాకేలా సినిమా తెరకెక్కించి ఫుల్ మార్కులు సంపాదించేసుకున్నాడు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ లో తీద్దామనే ఆలోచనతో కరణ్ జోహార్, గతంలోనే రైట్స్ కొన్నా తెరకెక్కించడంలో ఆలస్యం చేశాడు. ఆ తర్వాత పివిపి తెలుగు కోసం రైట్స్ తీసుకోవడం, సినిమా సూపర్ హిట్ కావడం జరిగిపోయింది. దీంతో ఇప్పుడు కరణ్ జోహార్ కు సినిమా మరింత సులభంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం దొరికింది. సినిమాలోని పాత్రల క్యాస్టింగ్ కూడా అయిపోయిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున పాత్రకు అమితాబ్ బచ్చన్, కార్తి పాత్రకు వరుణ్ ధావన్ ను తీసుకున్నారు. తమన్నా చేసిన పిఏ పాత్రకు చాలా మందిని అనుకున్నా, చివరికి తమన్నాయే ఆ పాత్రకు న్యాయం చేయగలదని కరణ్ జోహార్ భావించాడట. పిఏ గా ఊపిరి సినిమాకు గ్లామర్ ను యాడ్ చేసింది తమన్నా. పిఏ కీర్తిగా శ్రీను పాత్రను టీజ్ చేస్తూ నటనకు స్కోప్ ఉన్న పాత్రను పోషించింది తమన్నా. సినిమాలోని అన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని స్పృశించడంలో సక్సెస్ అయ్యాయి. అదే సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. అందుకే రీమేక్ లో కూడా తమ్మూనే కరణ్ ప్రిఫర్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



