Home

»

Latest News

బ‌న్నీ.. క్లాసు పీకాడా, కాకా ప‌ట్టాడా?

May 19, 2016

ఒక మ‌న‌సు ఆడియో ఫంక్ష‌న్లో బ‌న్నీ స్పీచే హైలెట్టు. పాట‌ల గురించీ, నిహారిక గురించి, ట్రైల‌ర్ గురించీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతా.. బ‌న్నీ నామ‌స్మ‌ర‌ణే.  14 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన  స్పీచ్ లో దాదాపు 12 నిమిషాలు 'చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌' కామెంట్ చుట్టూనే సాగింది. బ‌న్నీ పూర్తి స్థాయిలో ఓ స్పీచ్ ప్రిపేర్ చేసుకొని వ‌చ్చాడ‌ని... ఇవ‌న్నీ మాట్లాడేయాలి అని ముందే డిసైడ్ అయ్యాడ‌ని బ‌న్నీని చూస్తే అర్థ‌మైపోతుంది. కాంట్ర‌వ‌ర్సీకి సంబంధించిన నింది కాస్త తానూ పూసుకొని మిగిలిన‌దంతా అభిమానుల‌పై రుద్దేశాడు. ఒక విధంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి బ‌న్నీ క్లాసులాంటిది పీకాడు. అల్ల‌రి చేయ‌డం వ‌ల్ల మీ ప‌రువే పోతోంది బ్ర‌ద‌ర్ అని చెప్ప‌క‌నే చెప్పాడు. దాంతో పాటు న‌న్నంటే మిమ్మ‌ల్ని అన్న‌ట్టు కాదా అంటూ కాకా ప‌ట్టాడు.

నిజానికి బ‌న్నీ బాధ‌ని కూడా అర్థం చేసుకొనేదే.  బ‌న్నీ స్టేజీ ఎక్కిన ప్ర‌తీసారీ `ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్‌` అని అర‌చి గోల పెట్ట‌డం, ప‌వ‌న్ గురించి మాట్లాడ‌క‌పోతే స్టేజీ దిగ‌నివ్వం అన్న‌ట్టు రాద్దాంతం చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ఆఖ‌రికి చిరంజీవికీ ఇదే ప‌రిస్థితి. అక్క‌డే మ‌నోడు ఎక్కువ హ‌ర్ట్ అయిన‌ట్టున్నాడు. ప‌వ‌న్ ని అంత స్థాయికి తీసుకొచ్చిన చిరంజీవిగారినే మాట్లాడ‌నివ్వ‌కుండా చేస్తారా?  అన్న‌ది బ‌న్నీ స్పీచ్‌లో మెయిన్ పాయింట్‌. దాన్ని హైలెట్ చేస్తూ చిరంజీవి వీరాభిమానుల మ‌న‌సు గెలుచుకొనే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే బ‌న్నీ స్పీచ్‌.. చాలా కంట్రోల్‌గా సాగింది. త‌న బాధ‌ని, ఆవేద‌న‌నీ ఫ్యాన్స్ అర్థం చేసుకొంటే బాగుణ్ణు అనేలా సాగింది. బ‌న్నీ ఏ ఉద్దేశం కోసం అంత పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయి వ‌చ్చాడో..  అది కాస్తో కూస్తో నెర‌వేరాలా క‌నిపిస్తోంది. బ‌న్నీ ప్ర‌తీ విష‌యానికీ త‌న‌దైన శైలిలో క్లారిటీ ఇచ్చుకొంటూ వ‌చ్చాడు. ఇక‌... డౌట్లు లేవు.. అన్న‌ట్టు ప్ర‌తీదీ విడ‌మ‌ర్చి చెప్పాడు. దానికి ప‌వ‌న్ ఫ్యాన్స్ సంతృప్తి ప‌డితే... బ‌న్నీ స్పీచ్ వెనుకున్న ల‌క్ష్యం నెర‌వేరిపోయిన‌ట్టే. 
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com