Home

»

Latest News

ఆ ఒక్క ప్రశ్నతో నా నోరు మూయించింది..!

May 19, 2016

సాధారణంగా సినీకుటుంబాల నుంచి హీరోలే తప్ప, హీరోయిన్లు రావడం చాలా అరుదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంటరై ఈ అరుదైన కేటగిరీలోకి చేరింది మెగా ప్రిన్సెస్ నీహారిక. ఇప్పటికే మెగాకుటుంబం నుంచి ఏడుగురు హీరోలున్నారు. నీహారిక హీరోయిన్ గా వస్తూ, ఆ ఫ్యామిలీలో ఎనిమిదవ సినీతార అయ్యింది. అయితే నీహారిక హీరోయిన్ అవుతానన్నప్పుడు నాగబాబు మొదట ఒప్పుకోలేదట. ఆ విషయాల్ని ఒక మనసు ఆడియో వేడుకలో ఆయన షేర్ చేసుకున్నారు.

హీరోయిన్ అవుతానని చెప్పిన నా కూతురికి సపోర్ట్ చేసిన మా మెగాహీరోలందరికీ హ్యాట్సాఫ్. నీహారిక హీరోయిన్ అవుతానంటే మొదట నేను వద్దన్నాను. అబ్బాయిలు హీరోలవుతుంటే అడ్డు పెట్టని మీరు, నన్ను మాత్రం ఎందుకు వద్దంటున్నారు అని నీహా అడిగిన ఒక్క ప్రశ్న నా నోరు మూయించింది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్లకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి దులిపేసుకుందామా అని చూసే వాళ్లందరికీ నాదో విన్నపం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్ని చూడండి. వాళ్ల కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉండాలి. ఇష్టమైన కెరీర్ లో రాణించేలా అమ్మాయిలకు సపోర్ట్ ఇవ్వండి అన్నారు నాగబాబు. మరి ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాతైనా, మరింత మంది తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వస్తారేమో చూద్దాం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com