Home

»

Latest News

దేవిశ్రీ అదరగొట్టాడు..ఇక ఎన్టీఆర్ వంతు

May 20, 2015

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్‌ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ఈరోజు(మే 20) యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్ర విశేషాలను తెలిపారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ ఎన్టీఆర్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్‌కి మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ దేవిశ్రీప్రసాద్‌ ఆధ్వర్యంలో స్పెయిన్‌లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. జూన్‌ మొదటివారంలో లండన్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. సాహసం, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చేస్తున్న మరో భారీ చిత్రమిది’’ అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కో`ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుకుమార్‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com