
ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాల్లో పేర్ల నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల ఎన్నికల అధికారులు టాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజాలకు 'SIR' నోటీసులు జారీ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, విక్టరీ వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ, ఉపాసనలతో పాటు వివిఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, గోపీచంద్, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి. వీరు స్వయంగా కాకుండా తమ ప్రతినిధులను కూడా విచారణకు పంపవచ్చని అధికారులు వెల్లడించారు.
Telangana SIR, Mahesh Babu, SS Rajamouli, Venkatesh, Vijay Deverakonda, Telugu Film News, Telugu News






