'లై' ఎఫెక్ట్.. ఆ హీరోల రూట్ లోకి వచ్చిన నితిన్..
on Aug 19, 2017
నితిన్ నటించిన 'లై' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలసిందే. ఇక ఈ సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే కాస్త తగ్గుముఖం పట్టినట్టే తెలుస్తోంది. 'లై ' సినిమాతో పాటు అదే రోజు 'నేనే రాజు నేనే మంత్రి', 'జయ జానకీ నాయక' సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు కూడా 'లై' సినిమాను కాస్త దెబ్బకొట్టాయని చెప్పొచ్చు. అన్నీ కలసి 'లై' వసూళ్ల పరంగా వెనుకబడింది. దీంతో ఇప్పుడు నితిన్ ఒకటి రియలైజ్ అయ్యాడట. అదేంటనుకుంటున్నారా..? ఇక నుండి శర్వానంద్... నాని రూట్ లోకి వచ్చి సినిమాలు చేయాలనుకుంటున్నట్టు టాక్. ఎందుకంటే నాని .. శర్వానంద్ లు తమ సినిమా బడ్జెట్ 10 నుంచి 15 కోట్ల లోపే ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ మార్జిన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లనే వాళ్ల సినిమాలు హిట్ అయితే భారీ స్థాయిలో లాభాలు ఉంటాయి .. ఒకవేళ ఫ్లాప్ అయితే నష్టాలు పెద్దగా వుండవు.
ఇక ఈ సినిమాకు గాను నితిన్ 35 కోట్ల వరకూ ఖర్చు చేశాడు. సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ చేశారు కాబట్టి పెద్ద మొత్తంలోనే ఖర్చయింది. తీరా వసూళ్లు చూస్తే మాత్రం అనుకున్నంత రాబట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు కళ్లుతెరచిన నితిన్.. తక్కువ బడ్జెత్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి చూద్దాం.. ఇది ఎంతవరకూ వర్కవుట్ అవ్వుద్దో..