Home

»

Latest News

ట్రైల‌ర్ రివ్యూ : నిన్ను కోరి

Jun 17, 2017 1:54PM

కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌ట్టుకొని... వాళ్ల నుంచి త‌న‌కు కావ‌ల్సింది రాబ‌ట్టుకోవ‌డంలో దిట్ట అయిపోయాడు నాని. ఈమ‌ధ్య కాలంలో నాని విజ‌యాలు అందుకొన్న చిత్రాల‌న్నీ దాదాపుగా కొత్త ద‌ర్శ‌కుల‌తో చేసిన‌వే. మ‌రోసారి శివ నీర్వాణ‌ని ద‌ర్శ‌కుడ‌దిగా ప‌రిచయం చేస్తున్నాడు `నిన్ను కోరి` సినిమాతో.  నివేధా ధామ‌స్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. మ‌రోసారి.. ట్రైల‌ర్ ఫ్రెష్ లుక్‌తో సాగింది. నాని డైలాగులు, గోపీ సుంద‌ర్ సంగీతం, కెమెరా వ‌ర్క్‌, ఎమోష‌న్స్ ఇవ‌న్నీ.... ప‌క్కాగా పండిన‌ట్టు క‌నిపిస్తోంది. ఓ మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని... నాని మార్క్ కామెడీ టైమింగ్ తో మిక్స్ చేసిన‌ట్టు అనిపిస్తోంది. చివ‌ర్లో. `నీకు అర్థం అవుతోందా... నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది` అన్న‌చోట నాని లుక్ చూస్తే షాక్  ఇవ్వ‌డం ఖాయం.  త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. నాని ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్‌ని చేరుస్తుంద‌న్న భ‌రోసా క‌లిగించింది నిన్ను కోరి ట్రైల‌ర్‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com