Home

»

Latest News

మళ్ళీ విక్రమ్ నట విశ్వరూపం

Apr 6, 2011 12:07PM

anushka hot wallpapers, anushka hot stills, anushka hot images, anushka hot pics, anushka hot photos, anushka hot picturesమళ్ళీ హీరో విక్రమ్ తన నట విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే "శివపుత్రుడు", "అపరిచితుడు" వంటి చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులనందుకున్న సౌతిండియన్ స్టార్ విక్రమ్ సినీ రేస్ లో ఈ మధ్య కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి. తాను మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ సరసన నటించిన "విలన్" విక్రమ్ ని చాలా నిరాశపరిచింది. ఈ చిత్రం మీద విక్రమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.


కానీ తాను ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం "దైవ తిరు మగన్"లో మరోసారి విజృంభిస్తున్నాడట. ఈ చిత్రం ట్రైలర్లలో విక్రమ్ నటనను చూసిన తమిళ సినీ జనం విక్రమ్ మళ్ళీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ఒక మానసిక వికలాంగుడి (మెంటల్లీ హ్యాండి క్యాప్డ్) గా నటించారట. ఈ చిత్రంలో విక్రమ్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో మళ్ళీ విక్రమ్ జాతీయ అవార్డునందుకుంటాడని కోలీవుడ్ సినీ వర్గాలంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com