Home

»

Latest News

బాలయ్య డిమాండ్ బాగా పెరిగిందే..!

May 14, 2016 11:29AM

ఓవర్సీస్ ప్రేక్షకులకు క్లాస్ అంటే ఆసక్తి. నరకడాలు, చంపడాలపై సాధారణంగా అక్కడి ప్రేక్షకులు అంత ఇంట్రస్ట్ చూపించరు. బహుశా ఈ కారణంగానే కావచ్చు, బాలయ్యకు ఓవర్సీస్ మార్కెట్ అంత ఉండదు. సీనియర్ హీరోల్లో మనం, సోగ్గాడే, ఊపిరి లాంటి క్లాస్ సినిమాలతో నాగార్జున ఒక్కరే మార్కెట్ ను డెవలప్ చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా బాలయ్య వందో సినిమాకు అక్కడ డిమాండ్ పెరిగిపోయింది. కాదు కాదు..పెంచేస్తున్నారు. విషయంలోకి వెళ్తే, బాలయ్య వందో సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెడుతున్న బడ్జెట్, హైప్ చూసి సినీజనాల్లో కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఓవర్సీస్ ను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు శాతకర్ణి మేకర్స్..

ఇప్పటి వరకూ ఓవర్సీస్ లో బాలయ్య మార్కెట్ 3 కోట్లు దాటింది లేదు. అయితే శాతకర్ణి మూవీకి మాత్రం నాలుగు కోట్లు ఉండాలని సినిమా నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. మూడున్నర వరకూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఒకరు వచ్చారని, అయితే క్రిష్ అండ్ కో మాత్రం నాలుగు అయితేనే ముందుకు వెళ్దాం అని చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ నిర్మాతలు చెప్పిన రేటుకు కొనేస్తే, ఓవర్సీస్ మార్కెట్ లో 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేస్తేనే డిస్ట్రిబ్యూటర్ సేవ్ అవుతాడు. అయితే సినిమా ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో తెలియదు. పైపెచ్చు, అక్కడి ఆడియన్స్ సినిమాను ఆదరిస్తే ఫర్లేదు కానీ, ఏదైనా తేడాపాడా వస్తే తమ పొజీషన్ ఏంటని భయపడుతున్నారట డిస్ట్రిబ్యూటర్లు. చివరిగా బేరం ఎంతకి తెగుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com