Home

»

Latest News

హీరో నితిన్, త్రివిక్రమ్ లకు షాక్ ఇచ్చిన పవన్..!

Apr 21, 2016 11:14AM

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. స్నేహితులే కాక, ఇద్దరీ అభిప్రాయాలు, భావాలు కూడా ఒకేలా ఉంటాయి. అందుకే పవన్ త్రివిక్రమ్ కు అప్పుడప్పుడూ సడెన్ సర్ ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా అ..ఆ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చివరిదశకు చేరుకున్న ఈ సినిమా సెట్స్ లో ఒక్కసారిగా పవన్ ప్రత్యక్షమై, మూవీ  యూనిట్ కు స్వీట్ షాక్ ఇచ్చారు. విచిత్రంగా, నితిన్ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా పవన్ అక్కడే కూర్చుని చూశారట. తను భీభత్సంగా అభిమానించే పవన్ ముందు నటించాలంటే, కాస్త నెర్వస్ గా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించిందని నితిన్ ట్వీట్ చేశాడు. నితిన్ అన్నా, త్రివిక్రమ్ అన్నా పవన్ కు చాలా అభిమానం. అందుకే వాళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ చూడటానికి సెట్స్ కు వచ్చాడట పవన్. సర్దార్ రిలీజ్ కు ముందు గుర్రంపై ఊగుతూ, నితిన్ సమంతలు ఇద్దరూ పవన్ కు విష్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రతీ ఏడాదీ తన తోటలో పండే మామిడి పళ్లను నితిన్ కు పంపిస్తుంటాడు పవన్. వాటిని నితిన్ ట్విట్లర్లో షేర్ చేస్తుంటాడు. ఈ సారి వేసవికి డైరెక్ట్ గా పవనే తన సెట్లోకి వచ్చేయడంతో, నితిన్ ఆనందానికి హద్దుల్లేవు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com