Home

»

Latest News

రాజ‌మౌళికి హ్యాండిచ్చిన నాని

Jun 13, 2015 11:30AM

ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ తెలుగు చిత్ర‌సీమ మొత్తం బాహుబ‌లి కోసం ఎదురుచూస్తోంది. బాహుబ‌లి ఆడియో విడుద‌ల అంటే.. వాళ్లంద‌రికీ పండ‌గే. ఈ కార్య‌క్ర‌మాన్ని కాస్త ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల‌నుకొన్నాడు జక్క‌న్న రాజ‌మౌళి. ఈ కార్య‌క్ర‌మం యాంక‌రింగ్ బాధ్య‌త‌లు నానికి అప్పగించాడు. అయితే నాని చివ‌రి క్ష‌ణాల్లో రాజ‌మౌళికి హ్యాండిచ్చాడు. ఆ ప్లేసులో రెగ్యుల‌ర్ యాంక‌ర్ సుమ వ‌చ్చి చేరింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి కూడా ట్విట్ట‌ర్లో దృవీక‌రించాడు.

ఇటీవ‌ల 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' సినిమా షూటింగ్‌లో నాని కాలికి గాయ‌మైంద‌ట‌. అందుకే నాని రాలేక‌పోయాడ‌ట‌. దాంతో మరో మార్గం లేక‌.. సుమ‌ని హుటాహుటిన తిరుప‌తి ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు సాయింత్రం 7 గంట‌ల‌కు తిరుప‌తిలోన ఎస్వీ యూనివ‌ర్సిటిలో బాహుబ‌లి ఆడియో కార్యక్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు క‌నీసం ఇర‌వైవేల మంది ప్ర‌భాస్ అభిమానులు త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com