Home

»

Latest News

"అధినాయకుడు" విడుదల వెనుక

May 28, 2012 3:17PM

"అధినాయకుడు" విడుదల వెనుక ఎవరున్నారు అన్నది ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన విభిన్న కథా చిత్రం "అధినాయకుడు". ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది.

ఈ "అధినాయకుడు" చిత్రం నిజానికి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని సినీ వర్గాలంటున్నాయి. అయితే ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ సినిమా విడుదలవటం తమ పార్టీకి అత్యవసరం అని భావించిన నారా చంద్ర బాబు నాయుడు "అధినాయకుడు" చిత్రం విడుదలవటానికి అవసరమైన ఏర్పాట్లను చేశారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com