"ఆదిత్య369" కి సీక్వెల్ రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్ గా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, అనిత కృష్ణ నిర్మించగా విడుదలై ఘనవిజయం సాధించిన హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం"ఆదిత్య369". ఈ చిత్రం అప్పట్లో అపూర్వ ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ "ఆదిత్య369" చిత్రానికి సీక్వెల్ గా మరో చిత్రం రానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అదే జరిగితే మళ్ళీ బాలకృష్ణే హీరోగా నటిస్తాడా...? మళ్ళీ సింగీతం శ్రీనివాసరావే ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తాడా...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరి కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే....!




