Home

»

Latest News

ట్రైలర్ రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

Jun 23, 2017 12:35PM

బాహుబలి తర్వాత రానా హీరోగా చేస్తుండటం..రానా, కాజల్, తేజ క్రేజీ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇవాళ దువ్వాడ జగన్నాథమ్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో "నేనే రాజు నేనే మంత్రి" ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హీరో రానా ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. "వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడేమైనా అల్లూరి సీతారామరాజా..సుభాష్ చంద్రబోసా" అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్‌ స్టార్ట్ అవుతుంది. రానా..కాజల్ వైపు చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో "నెలవంక తొంగి చూసింది" అంటూ ఎన్టీఆర్ నటించిన పాట ప్లే అవుతుంది. కాజల్‌ నడుముని రానా టేప్‌తో కొలుస్తుండగా..ఒక్కసారిగా గన్ పేలిన శబ్ధం రావడం..రానా హస్పటిల్ నుంచి ఏడుస్తూ రావడం చూస్తుంటే కాజల్ చనిపోతుందని అర్ధమవుతుంది.

ఆ తర్వాత రానా సీరియస్‌గా పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం..ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లడం చూస్తుంటే..పగ, ప్రతీకారం, అధికారం చుట్టూ కథ సాగే అవకాశం ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అదిరిపోయింది. కేథరిన్ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com