Home

»

Latest News

రోజుకి రెండు కోట్లు అడిగిన హీరోయిన్‌

Apr 13, 2015 10:37AM


దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం ఎలాగో మ‌న క‌థానాయిక‌ల‌కు బాగా తెలుసు. ఫామ్‌లో ఉండ‌గానే పారితోషికాల పేరుతో పిండేస్తారు. ఈ విద్యలో న‌య‌న‌తార ఎప్పుడో ఆరితేరిపోయింది. క‌థానాయిక పారితోషికాన్ని సౌత్‌లో కోటి దాటించిన ఘ‌న‌త న‌య‌న‌కే ద‌క్కుతుంది. ఇప్పుడు... ఎండార్స్‌మెంట్ల విష‌యంలోనూ చుక్క‌లు చూపిస్తోంది. ఓ న‌గ‌ల దుకాణానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కోసం న‌య‌న‌తార‌ని సంప్ర‌దించారు. `ఓయ‌న్‌.... యాడ్స్‌లో న‌టించ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేదు..` అందట‌. అయితే పారితోషికంగా రోజుకి రెండు కోట్లు ఇస్తే చాలంద‌ట‌. దాంతో.. ఆ న‌గ‌ల దుకాణం వాళ్లు అదిరిప‌డ్డారు. రెండు రోజుల‌కు రూ.4 కోట్లు స‌మ‌ర్పించుకొనే ప‌రిస్థితిలో తాము లేమ‌ని.. న‌య‌న‌కు ఓ దండం పెట్టి వెళ్లిపోయార‌ట‌. ఈ ఉదంతాన్ని త‌మిళ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com