Home

»

Latest News

అన్నయ్యకి నయన్?

May 14, 2015 10:15AM

నిన్నటి వరకూ చిరంజీవి సినిమా ఎప్పుడు? దర్శకుడెవరు? కథేంటి? అనే డిస్కషన్ నడిచింది. అది ఓ కొలిక్కి వచ్చిందో లేదో అప్పుడే అందరి కళ్లూ హీరోయిన్ మీద పడ్డాయి. ఇంతకీ రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరా? అనే డిస్కషన్ జోరందుకుంది. హిట్ కాంబినేషన్ కదా అని అతిలోక సుందరి శ్రీదేవిని తీసుకుందామంటే....ముసలి ఛాయలు వచ్చేశాయి. పోనీ లేటెస్ట్ నాటీ గాళ్ల్స్ ని సెలెక్ట్ చేద్దామంటే మరీ చిన్నపిల్లలాయె. అందుకే మరీ పెద్దగా.... మరీ చిన్నగా ఉండకూడదు. ఫేడవుట్ అయిపోయిన భామలొద్దు. ఎంతోకొంత క్రేజ్ ఉన్న అమ్మాయి అయితే మంచిదనుకున్నారు. దీంతో చిరు-పూరీ కళ్లు నయనతారపై పడ్డాయి. తమిళ, తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న నయనతార అయితే అన్నయ్య పక్కన అదిరిపోద్దని ఫిక్సయ్యారట. అదే జరిగితే మెగా కాంపౌండ్ లో నయన్ మొదటి చిత్రం ఇదే. మరి ఈ గుసగుసల్లో నిజమెంతో చూద్దాం...!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com