Home

»

Latest News

నారా రోహిత్ ఫస్ట్ లుక్ అవుట్.. 'ఆదర్శ కుటుంబం'లో పోలీస్ ఆఫీసర్‌గా రచ్చ.!

Jul 25, 2026 12:54PM

విలక్షణమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ నారా రోహిత్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసింది.

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. పోస్టర్‌లో నారా రోహిత్ తెలంగాణ స్టేట్ పోలీస్ గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. మెరూన్ కలర్ షర్ట్, కాకీ ప్యాంట్ ధరించి, చేతికి వాచ్, నోట్లో సిగరెట్ వెలిగిస్తూ ఉన్న ఆయన ఇంటెన్స్ అవతార్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. 

'బాణం', 'సోలో', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి చిత్రాలతో తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్, త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఉండే చిత్రంలో రోహిత్ రోల్ చాలా కీలకంగా ఉండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పూజిత పొన్నాడ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విజృంభించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

Aadarsha Kutumbam, Nara Rohith, First Look, Trivikram, Venkatesh

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com