నారా రొహిత్ కొసం మూడు రోజుల పాత్ర చేసిన నాగశౌర్య
on Jul 30, 2017
బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ గెస్ట్ రోల్ చేయటం సాంప్రదాయం గా వస్తుంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రంలో షారుక్‌ఖాన్ ఓ గారడి వాడి పాత్ర చేసి మెప్పించాడు. అయితే ఇదే తరహ పాత్రలు తమిళం లో కూడా వస్తున్నాయి. ఇదే ట్రెండ్ ని ఇప్పడు టాలీవుడ్ కి కూడా యంగ్ హీరోలు కొనసాగిస్తున్నారు. ఎవడు, రుద్రమదేవి చిత్రాల్లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కేవలం ఫ్రెండ్‌షిప్ కొసమే చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నారా రోహిత్ నటిస్తున్న కథలో రాజకుమారి చిత్రంలో ఓక మూడురోజుల పాత్ర వుందని దానికి ఓ యంగ్‌హీరో కావాలని దర్శకడు చెప్పటంతో నారా రోహిత్ నాగశౌర్య పేరు సూచించాడట. అప్పటికే జ్యాఅచ్చుతానంద సినిమాలో యంగ్ హీరోలు నారా రోహిత్, నాగ శౌర్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత నారా రోహిత్, నాగ శౌర్య బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. అందుకే అడిగిన వెంటనే రొహిత్ తో వున్న స్నేహం కారణంగానే శౌర్య ఈ సినిమాలో ఓ పాత్ర పోషించిడానికి ఒప్పకున్నాడని సినీ జనాలు అంటున్నారు. పైగా ఈ రోల్ లో యాక్ట్ చేసినందుకు శౌర్య ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. పైగా ఒ పక్క తన సోంత ప్రోడక్షన్ లో వెంకి దర్శకుడుగా శౌర్య చిత్రం షూటింగ్ లో మరియు లైకా ప్రోడక్షన్ లో తమిళ, తెలుగు భాషల్లో సాయిపల్లవి హీరోయిన్ గా ఓ చిత్ర షూటింగ్ లో బిజిగా వున్నా కూడా రొహిత్ తో తన స్నేహం కారణంగా చిత్రాన్ని చేశాడట. ఈ చిత్రం అగష్టు 25న విడుదలకి సిధ్ధంగా వుంది. మరి ఈ ఇద్దరు స్నేహితులు నటించిన కథలో రాజకుమారి సినిమాతో ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
