కొత్త ప్రశ్నలు సంధిస్తున్న హీరో నాని..!
on Apr 28, 2016

తనకు మొదటి సినిమాతో హిట్టిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో నాని చేస్తున్న రెండో సినిమా జెంటిల్ మన్. ఇప్పటికే ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్న మూవీ టీం, లేటెస్ట్ గా మరో రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. హీరోనా విలనా..రాముడా రావణుడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాడు హీరో నాని. సినిమాలో హీరో పాత్ర రెండు రకాల షేడ్స్ తో ఉంటుందని సమాచారం. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న జెంటిల్ మన్ సినిమాపై తమ పోస్టర్లతోనే ఆసక్తిని కలిగిస్తున్నారు మూవీ టీం.

సినిమా గురించి ఎవరు ఏమి అడిగినా, నాని మాత్రం మూవీలోనే చూసి తెలుసుకోండంటూ ఎస్కేప్ అవుతున్నాడు. మూవీలో మిగిలిన నటీనటులు ఎవరు, హీరోయిన్ ఎవరు లాంటి వివరాలు కూడా బయటకు రానివ్వకుండా, క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు నాని అండ్ కో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, చాలా కాలం తర్వాత మణిశర్మ సంగీతం అందించిన సినిమా కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



