నాగార్జునకి లక్కీ సరే... మరి అఖిల్‌కి కలిసొస్తుందా?
on Jul 26, 2017
అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ కన్నా, తన కొడుకుల కెరీర్ సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగ చైతన్య రెండు వరుస హిట్లతో దాదాపు కుదురుకున్నట్టే, వచ్చే నెలలో యుద్ధం శరణామి తో మరొక సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొడుకుకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశ్యం తో నాగార్జున తన సినిమా రాజు గారి గది 2 ని అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అయితే, నాగార్జున దిగులంతా తన చిన్న కొడుకు అఖిల్ గురించే. భారీ బడ్జెట్ తో నిర్మించబడిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, రెండవ సినిమా ఓకే చేయడానికి వందల రోజులు తీసుకున్నాడు. ప్రేమకథ చిత్రాల్ని కమర్షియల్ గా తీయగల సత్తా ఉన్న విక్రమ్ కుమార్ కి అఖిల్ రెండవ సినిమా బాధ్యత అప్పగించాడు నాగార్జున.
సినిమాకి సంబంధించి కొన్ని రషెస్ చూశానని చాలా బాగా వస్తుందని, తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు నాగ్. విక్రమ్ కుమార్ తన మ్యాజిక్ మేకింగ్ మరొకసారి చూపించబోతున్నాడని... సినిమాని తన లక్కీ మంత్ అయిన డిసెంబర్ లో 22 వ తారీఖున విడుదల చేస్తామని చెప్పాడు. ఇంత వరకు ఒకే కానీ, తనకి అదృష్టం తీసుకువచ్చిన డిసెంబర్ నెల అఖిల్ కి కూడా మంచి చేస్తుందా? సెంటిమెంట్స్ కామన్ కానీ, మొత్తానికి సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది. చూద్దాం, నాగ్ సెంటిమెంట్ అఖిల్ కి ఎంత వరకు పని చేస్తుందో!
Also Read