Home

»

Latest News

నాగ్‌... 30 ఇయ‌ర్స్ ఇండ్ర‌స్ట్రీ..!

May 23, 2016

క్లాస్‌, మాస్ గీత చెరిపేసిన హీరో!
అటు యూత్‌కీ, ఇటు ఫ్యామిలీకీ చేరువైన హీరో!
ఆఖ‌రికి పండు ముస‌లిని కూడా బుట్ట‌లో వేసుకొన్న హీరో!  ........... ఇంకెవ‌రూ నాగార్జునే.

శివలా చైను పట్టుకొన్న వేళ యూత్ స్టార్ అయ్యాడు. నిన్నే పెళ్లాడేస్తా అంటూ పాట పాడుకొంటే అమ్మాయిలు ప‌డిపోయారు. అన్న‌మ‌య్య‌తో ఫ్యామిలీ మ‌న‌సు గెలుచుకొన్నాడు. శ్రీ‌రామ దాసుతో ముస‌లీ ముత‌కానీ త‌న జ‌ట్టుగా చేసుకొన్నాడు. యాభై దాటినా టాలీవుడ్ మ‌న్మ‌ధుడు అనిపించుకొంటున్నాడు. త‌న ఇంట్లోంచి ఇద్ద‌రు హీరోలొచ్చినా.. గ్రీకువీరుడిగానే చ‌లామ‌ణీ అవుతున్నాడు. నాగ్ ఈరోజుతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స‌రిగ్గా 30 ఏళ్లు. నాగార్జున తొలి చిత్రం విక్ర‌మ్ స‌రిగ్గా 30 ఏళ్ల క్రితం ఈ రోజే విడుద‌లైంది. అక్క‌డ్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. టాలీవుడ్ టాప్ స్టార్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతూ, నిర్మాత‌గానూ విజ‌యాలు అందుకొని తిరుగులేని ప్ర‌యాణం సాగించాడు అక్కినేని నాగార్జున‌..

 

చిరంజీవి స్టెప్పుల‌తో, వెంకీ సెంటిమెంట్‌తో, బాల‌య్య డైలాగుల‌తో...ఫ్యాన్స్‌ని సంపాదించుకొన్న త‌రుణంలో వీళ్లంద‌రికీ విభిన్నంగా వెళ్లి.. త‌న‌కంటూ ఓ స్థానం ద‌క్కించుకోవ‌డం మామూలు విష‌యంకాదు. ఆ అసాధ్యాన్ని నాగ్ సుసాధ్యం చేసుకొన్నాడు. క‌థ‌ల ఎంపిక‌లో ప‌రిణ‌తి, వైవిధ్యాన్ని న‌మ్ముకొన్న విధానం నాగ్‌ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వాలంటే నాగే గుర్తొస్తారు. శివ‌తో.. టాలీవుడ్ చ‌రిత్ర‌ని తిర‌గ‌రాసింది రాంగోపాల్ వ‌ర్మ‌నే అయినా... అత‌న్ని వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం నాగార్జునే. అక్క‌డ్నుంచి కొత్త‌వాళ్ల‌ని ప్రోత్స‌హించ‌డం మిష‌న్‌గా ఎంచుకొన్నాడునాగ్‌. ఇప్ప‌టికీ అదే కొన‌సాగిస్తున్నాడు. క‌థ‌, అందులో త‌న పాత్ర న‌చ్చితే ఎలాంటి ప్ర‌యోగాలు చేయ‌డానికైనా వెనుకంజ వేయ‌లేదు. నిన్నే పెళ్లాడ‌తా లాంటి సినిమా త‌ర‌వాత‌.. అన్న‌మ‌య్య‌గా క‌నిపించే సాహ‌సం ఎవ‌రైనా చేయ‌గ‌లరా? అది కేవ‌లం నాగార్జున‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. అందుకే అనిత‌ర సాధ్య‌మైన విజ‌యాలు నాగ్‌ని వ‌రించాయి. అప్ప‌టి వ‌ర‌కూ నాగ్ చేసిన సినిమాలు ఒక ఎత్త‌యితే అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడీసాయి మ‌రో ఎత్తు. వైవిధ్యాన్ని న‌మ్ముకొన్న నాగ్ కెరీర్‌లో మ‌నం, ఊపిరి సినిమాలు మైళ్లు రాళ్లుగా నిల‌చిపోతాయి. బుల్లి తెర‌పై కూడా నాగ్ త‌న‌దైన ముద్ర వేశాడు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ ఇంటిల్లిపాదికీ మ‌రీ ద‌గ్గ‌రైపోయాడు.

నాగ్ 30 ఏళ్ల ప్ర‌యాణంలో ఎన్నో విజ‌యాలు. మ‌రెన్నో మ‌జిలీలు. నాగ్ 30 ఏళ్లంటే మ‌రో 30 ఏళ్ల‌యినా మాకు హీరోనే అంటారు అభిమానులు. అంతే మ‌రి.. మ‌రో 30 ఏళ్లు గ‌డిచినా నాగ్ అలానే ఉంటాడు.. అప్ప‌టికీ మ‌న్మ‌థుడు అనిపించుకొంటాడు. జీతేర‌హో నాగ్‌..

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com