సినీ చరిత్రలో సరికొత్త ప్రయోగం..!
on Jun 1, 2016
కోడి రామకృష్ణ ప్రయోగాలకు మారుపేరుగా చెప్పచ్చు. తెలుగు సినిమాల్లో ఆయనదంటూ ససెపరేట్ స్టైల్ ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ సినిమాలు తీయాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరు సంపాదించుకున్నారు. అమ్మోరు సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పూర్తిస్థాయి గ్రాఫిక్స్ సామర్ధ్యాన్ని చూపించిన ఆయనే అరుంధతితో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక స్థాయిని క్రియేట్ చేశారు. అయితే ఇంత క్రియేటివ్ జీనియస్ గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయట్లేదు. గత రెండేళ్లుగా కన్నడలో ఒక సరికొత్త సినిమాను తెరకెక్కించే పనిలో ఉండటమే అందుక్కారణం. నాగరాహవు పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో 2009లో పరమపదించిన కన్నడ స్టార్ విష్ణువర్ధన్ హీరోగా చేస్తున్నారు.
అదేంటి అదెలా సాధ్యం అంటారా..అందుకేగా ఈ సినిమాను సరికొత్త ప్రయోగం అని అన్నది. సినీ చరిత్రలోనే తొలిసారిగా, చనిపోయిన వ్యక్తిని హీరోగా పెట్టి సినిమాను తీస్తున్నారు. గతంలో యమదొంగ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ ను చిన్న బిట్స్ లో చూపించినా, అవి సీన్స్ మాత్రమే. కానీ ఫుల్ లెంగ్త్ సినిమాలో బ్రతికి లేని వ్యక్తిని హీరోగా పెట్టి తీయాలంటే మాత్రం చిన్న విషయం కాదు. ప్రస్తుతం కన్నడ సీమలో ఈ సినిమాయే హాట్ టాపిక్. 1972లో వచ్చిన నాగరాహవు అనే సినిమా విష్ణువర్థన్, అంబరీష్ లను స్టార్స్ గా నిలబెట్టింది. అదే టైటిల్ ను ఈ సినిమాకు కూడా తీసుకున్నారు. అయితే కథ పరంగా చాలా మార్పులుంటాయని చెబుతున్నారు. కోడి రామకృష్ణ. మూవీలో నాగకన్యగా తమిళ నటి రమ్య నటిస్తున్నారు. ఏడు దేశాల్లోని 576 గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్స్, 730 రోజుల పాటు శ్రమించి ఈ సినిమాను తయారుచేయడం విశేషం. కన్నడలో ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. జూలై లో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.