Home

»

Latest News

ఆ ఇర‌వై నిమిషాలూ.. బ్ర‌హ్మీ ఇర‌గ‌దీశాడ‌ట‌!

Apr 23, 2015 11:17AM

 

నాగ‌చైత‌న్య‌, సుధీర్ వ‌ర్మ‌ల దోచేయ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. త‌క్క‌వ బ‌డ్జెట్‌లో తీసినా విజువ‌ల్స్ గ్రాండ్ గా ఉన్నాయ‌ట‌. స్వామి రారా త‌ర‌హాలోనే ఓ క్లీన్ అండ్ ఇంట్ర‌స్టింగ్ మూవీగా ఈ సినిమాని మ‌లిచాడ‌ట సుధీర్ వ‌ర్మ‌. ఈ సినిమాతో మరో హిట్టు కొట్ట‌డం ఖాయం అంటున్నారంతా. సినిమా అంతా ఒక‌యెత్త‌యితే చివ‌రి 20 నిమిషాలూ మ‌రో ఎత్త‌ట‌. బ్ర‌హ్మానందం ఎంట్రీతో సినిమా పీక్‌కి వెళ్తుంద‌ట‌. ఈ ఎపిసోడ్ మొత్తం బ్ర‌హ్మానందం సింగిల్ హ్యాండ్‌తో న‌డిపించేసిన‌ట్టు స‌మాచారం. రేసుగుర్రంలోని చివ‌రి ప‌ది నిమిషాలూ బ్ర‌హ్మానందం ఆడించేశాడు. సేమ్ టూ సేమ్ ఇక్క‌డా... అదే త‌ర‌హాలో రెచ్చిపోయాడ‌ట‌. బ్ర‌హ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పుకొంటున్నారు. అంటే... ఈ సినిమాలో బ్ర‌హ్మానందం డామినేష‌న్ కనిపిస్తుంద‌న్న‌మాట‌. సినిమా అంతా చైతూ క‌ష్ట‌ప‌డితే.. చివ‌ర్లో వ‌చ్చి క్రెడిట్ దోచేశాడు బ్ర‌హ్మానందం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com