బన్నీ రేంజ్ అలా ఉంది మరి!
on Aug 16, 2017
.jpg)
శాటిలైట్ రైట్స్ అనేది నిర్మాతల పాలిటి వరం అనే అనాలి. కథను నమ్ముకొని, పగడ్బందీ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేస్తే... తక్కువ ఖర్చుతో సినిమా పూర్తయిపోతుంది. శాటిలైట్ రైట్స్ అమ్ముకుంటే సగం ఖర్చు వచ్చేస్తుంది. ఇక మిగిలిన బిజినెస్ తో నిర్మాత ఈజీగా బయట పడొచ్చు. ఇదే ప్రస్తుతం సినిమా బిజినెస్ స్టాటజీ.
అయితే... అనవసరపు నిర్మాణ వ్యయం, నెలల తరబడి చిత్రీకరణ.. లాంటి పొరబాట్లు జరిగితే మాత్రం... శాటిలైట్ హక్కులు కూడా నిర్మాతలను బయట పడేయలేవు. ఇది నిజం. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే... అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’ చిత్రం శాటిలైట్ రైట్స్ ఏకంగా పది కోట్లకు అమ్ముడు పోయింది. బన్నీ కెరీర్ లో ఇదే హయ్యస్ట్ ఇదే. ఇంతవరకూ సెకండ్ షెడ్యూల్ మొదలు కాకుండానే.. ఈ సినిమాకు ఆ స్థాయిలో శాటిలైట్ రైట్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈ నెల 18 నుంచి మొదలు కానుంది. అను ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరత్ కుమార్ ప్రతినాయకునిగా నటిస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పకుడు. బన్నీ వాసు సహనిర్మాత. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాత.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



