Home

»

Latest News

ల‌క్కీ స్టార్స్ తోనే జట్టుక‌డుతున్న‌ మీనా

Mar 04, 2021

90ల్లో తెలుగునాట తిరుగులేని క‌థానాయిక‌గా రాణించారు అభినేత్రి మీనా. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ అదే హ‌వాను సాగించారు. క‌ట్ చేస్తే.. పెళ్ళ‌య్యాక సినిమాల‌ను త‌గ్గించుకున్న మీనా.. అడ‌పాద‌డ‌పా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. వ‌య‌సుకు త‌గ్గ వేషాల్లో అల‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య `సాక్ష్యం` సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కి అమ్మ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన మీనా.. ప్ర‌స్తుతం త‌న‌కు అచ్చొచ్చిన  సీనియ‌ర్ స్టార్స్ కి జోడీగానే న‌టిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌లైన మ‌ల‌యాళ చిత్రం `దృశ్యం 2`లో మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌‌న్ లాల్ కి జంట‌గా క‌నిపించిన మీనా.. ఇప్పుడు ఆ సినిమాకి తెలుగు వెర్ష‌న్ గా రూపొందుతున్న `దృశ్యం 2`లో విక్ట‌రీ  వెంక‌టేశ్ కి జోడీగా న‌టిస్తున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న‌ త‌మిళ చిత్రం `అణ్ణాత్తే`లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కి పెయిర్ గా యాక్ట్ చేస్తున్నారు. అదే విధంగా.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకి జోడీగా `స‌న్ ఆఫ్ ఇండియా`లోనూ మీనా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

మొత్త‌మ్మీద‌.. త‌న ల‌క్కీ స్టార్స్ తో మ‌రోమారు జుట్టుక‌డుతూ ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో వార్త‌ల్లో నిలుస్తున్నారు మీనా.‌

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com