Home

»

Latest News

ఛార్మికి ఇది కూడా పాయె...

Aug 1, 2015 10:06AM

మ‌ధ్య మ‌ధ్య‌లో ఐటెమ్ సాంగులు చేసినా - లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌పైనే దృష్టి పెట్టింది ఛార్మి. పూరి తీసిన జ్యోతిల‌క్ష్మితో త‌న రేంజు పెరుగుతుంద‌ని ఆశ‌ప‌డింది. ఆ సినిమాకి పైసా పారితోషికం తీసుకోకుండా, సినిమాలో వాటా కోసం న‌టించింది. అటు పారితోషికం రాలేదు, ఇటు లాభాలూ దక్క‌లేదు. దాంతో నీర‌స‌ప‌డిపోయిన ఛార్మి - మంత్ర 2పై ఆశ‌లు పెట్టుకొంది.

మంత్ర సినిమా ఛార్మి కెరీర్‌లో ఓ మైలు రాయి. ఆ సినిమాతో తొలి నంది అవార్డు కూడా అందుకొంది. మ‌ళ్లీ త‌న‌కు పూర్వ వైభ‌వం తెస్తుంద‌నుకొన్న మంత్ర 2 శుక్ర‌వారం విడుద‌లై... దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాలో విష‌యం లేద‌ని విమ‌ర్శ‌కులు తేల్చేశారు. అంతేనా.. అంటే న‌టిగా ఛార్మి కి మైన‌స్ మార్కులు కూడా వేశారు. ఛార్మి కెరీర్లో ఇంత పూర్ గా న‌టించిన సినిమా ఏదీ లేద‌ని ఏకిపడేశారు. దాంతో ఛార్మి ఆఖ‌రి ఆశ కూడా అడియాశ అయిపోయింది.

ఇప్పుడు ఛార్మి చేతిలో సినిమాలేం లేవు. పోనీ ఇది వ‌ర‌క‌టిలా ఐటెమ్ పాట‌లైనా చేస్తుంద‌నుకొంటే `నేను ఐటెమ్ పాట‌లు చేయ‌నుగాక చేయ‌ను` అంటూ ఈమ‌ధ్య ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ప్ర‌త్యేక గీతాలొస్తే వ‌దులుకోదేమో. ఎందుకంటే ఏదోలా గెటిన్ అయిపోవాలిగా. ఛార్మింగ్ ఛార్మికి ఛార్జింగ్ ఇచ్చేది ఇప్పుడు ఐటెమ్ గీతాలొక్క‌టే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com