మంచు విష్ణుకి గాయాలు.. ఐసియూలో చికిత్స..
on Jul 30, 2017
హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం.. ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మూడో షెడ్యూల్ కోసం మలేషియా వెళ్లారు చిత్రయూనిట్. ఓ సీన్‌లో విష్ణు బైక్ వెళుతుండగా ప్రమాదవశాత్తూ బైక్ స్కిడ్ అయి కిందపడటంతో గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం తరువాత నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మూడోసారి ముచ్చటగా ‘ఆచార అమెరికా యాత్ర’ సినిమాలో నటించారు. మలేషియా షూటింగ్ షెడ్యూల్ పూర్తికాగానే యూనిట్ మొత్తం అమెరికాలో చివరి షెడ్యూల్డ్‌కు ప్లాన్ చేశారు నిర్మాతలు. విష్ణుకి గాయాలు కావడంతో షూటింగ్‌కు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
