'ఒక్కడు మిగిలాడు' వచ్చేశాడు.. డైలాగ్స్ అదుర్స్..
on Aug 19, 2017
మంచు మనోజ్ నటించిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం థియెట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ ను మనోజ్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమాలో మనోజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మనోజ్ డైలాగ్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉన్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి!' అంటూ... 'భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు?. తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా?' అనే ఉద్విగ్నభరితంగా చెబుతున్న డైలాగ్స్ బావున్నాయి.
'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే' అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి దేశభక్తితో వస్తున్న ఈ సినిమా మనోజ్ కు ఎంతవరకు కలిసొస్తుందో చూద్దాం..కాగా అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లక్ష్మీకాంత్, ఎస్‌ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
